Site icon NTV Telugu

అలర్ట్‌ : 6 రోజుల పాటు రాత్రివేళ రైల్వే రిజర్వేషన్‌ బంద్‌..

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం ఓ విషయాన్ని ప్రకటించింది. 6 రోజుల పాటు రాత్రి పూట రిజర్వేషన్‌ సౌకర్యం లేదని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు రిజర్వేషన్‌ ఉండదని స్పష్టం చేసింది. నేటి రాత్రి నుంచి 20వ తేదీ వరకు సేవలకు అంతరాయం కలుగుతుందని ఇది ప్రయాణికులు గమనించాలని కోరింది.

అంతేకాకుండా కరెంట్‌ బుకింగ్‌, టికెట్ల రద్దు సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. రైల్వే డేటా అప్‌డేట్‌ చేస్తున్న నేపథ్యంలో సేవలకు అంతరాయం కలుగుతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది.

Exit mobile version