NTV Telugu Site icon

కొత్త‌గా ట్రైచేశాడు… సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు…

కొత్త‌గా చేసే ప్ర‌య‌త్నాలు ఎప్పుడూ ఆక‌ట్టుకునే విధంగా ఉంటాయి. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంటాయి. ఇక ఫుడ్ కు సంబంధించిన అన్ని వీడియోలు ఆక‌ట్టుకుంటుంటాయి. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒక‌టిగా చెప్పుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌లు, ఇత‌ర కూర‌గాయ‌ల‌తో చేసిన ప‌కోడీలు తినితిని బోర్ కొట్టింద‌నుకుంటా… కొత్త‌గా ట్రైచేశాడు. రుచి బాగుండ‌టంతో క‌మ‌ర్షియ‌ల్‌గా ఆ కొత్త ప‌కోడీలు వేయ‌డం మొద‌లుపెట్టారు. వినియోగ‌దారుల‌కు కూడా న‌చ్చ‌డంతో కొనుగోలు పెరిగింది. ఇంత‌కీ ఆ కొత్త‌ర‌కం ప‌కోడీలు ఎంట‌ని అనుకుంటున్నారా అక్క‌డికే వ‌స్తున్నా.

Read: హిందువుల‌కు ఆ భూమిని అప్ప‌గించిన పాక్ ప్ర‌భుత్వం…

గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌కు చెందిన ఓ స్ట్రీట్ వెండ‌ర్ ఓరియో బిస్కేట్స్‌తో ప‌కోడీలు వేయ‌డం మొద‌లుపెట్టాడు. ఈర‌కం ప‌కోడీలు రుచిగా ఉండ‌టంతో సేల్స్ పెరిగింది. ఓ ఫుడ్ బ్లాగ‌ర్ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు ఈ కొత్త‌ర‌కం ప‌కోడీల‌పై అనేక కామెంట్లు చేస్తున్నారు.