Site icon NTV Telugu

ఉల్లి ధ‌ర‌లు మ‌ళ్లీ పెర‌గ‌బోతున్నాయా?

క‌రోనా కాలంలో ఉల్లి ధ‌ర‌లు భారీగా పెరిగిన సంగ‌తి తెలిసిందే.  గ‌త నాలుగైదు నెల‌లుగా ఉల్లి ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి.  అయితే,  కొన్ని రోజులుగా వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో ఉల్లి పంటలు పాడైపోయాయి.  దీంతో దేశంలో మ‌ళ్లీ ఉల్లి ఘాటు పెరిగేలా క‌నిపిస్తోంది.  ఉల్లి ధ‌ర‌లు ఆకాశాన్ని తాకే అవ‌కాశం ఉన్న‌ట్టుగా నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  గ‌తంలో రూ.20-30 ప‌లికిన ధ‌ర‌లు ఇప్పుడు రూ.40-50 ప‌లుకుతున్న‌ది.  ఈ ధ‌ర‌లు మ‌రింత‌గాపెరిగే అవ‌కాశం ఉన్న‌ది.  నిల్వ ఉంచిన పంట‌ను రైతులు విదేశాల‌కు ఎగుమ‌తి చేసేందుకు ఆసక్తి చూపుతుండ‌టంతో ధ‌ర‌లు భారీగా పెరిగే అవ‌కాశం ఉన్న‌ది.  మ‌ళ్లీ కొత్త పంట చేతికి వ‌చ్చేంత వ‌ర‌కు ధ‌ర‌ల పెరుగుద‌ల త‌ప్ప‌క‌పోవ‌చ్చు.

Read: ఇండియా- అమెరికా సైనికుల మ‌ధ్య క‌బ‌డ్డీ మ్యాచ్‌…

Exit mobile version