NTV Telugu Site icon

వైరల్ వీడియో… చంద్రబాబు ఏడ్చాడని తానూ ఏడ్చిన చిన్నారి

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాల పట్ల తీవ్ర మనస్తాపం చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు బోరున ఏడ్చిన సంగతి తెలిసిందే. కనీసం మాటలు కూడా రాని స్థితిలో ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. గతంలో చంద్రబాబును ఆ స్థితిలో ఎప్పుడూ చూడని ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. చంద్రబాబు మీడియా సమావేశంలో విలపించడం చూసి ఓ చిన్నారి కూడా ఏడ్వడం ఆ వీడియోలో కనిపించింది.

Read Also: జగన్ గాల్లో నుంచి కిందకు దిగాలి: నారా లోకేష్

చిన్నారిని ఎందుకు ఏడుస్తున్నావు అని కుటుంబసభ్యులు అడిగితే… ‘టీవీలో చంద్రబాబు ఏడుస్తున్నాడు.. అందుకే నాకు ఏడుపొస్తుంది’ అంటూ ఆ బాలిక తాను కూడా బోరున ఏడ్చేసింది. తల్లిదండ్రులు ఎంత సముదాయించినా ఆ బాలిక ఏడుపు ఆపలేదు. చంద్రబాబుకు ఫోన్ చేస్తానంటూ ఆ బాలిక తండ్రి ఎంత నచ్చచెప్పినా ఏడుస్తూనే ఉంది. చంద్రబాబును ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయిన చిన్నారి కూడా తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యిందని వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

https://ntvtelugu.com/wp-content/uploads/2021/11/VIRAL-VIDEO_-See-How-Girl-Crying-After-Watching-Chandrababu-Naidu-Emotional-Speech-_-TDP-_-Leo-News.mp4