Site icon NTV Telugu

మరోసారి అమెరికా వైట్‌హౌస్‌లో కరోనా కలకలం..

అగ్రరాజ్యమైన అమెరికా పాలన కార్యాలయం వైట్‌ హౌస్‌లో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. గత నెలలో కూడా శ్వేత సౌధంలో కరోనా కేసులు బయటకు రావడంతో వైద్యులు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు పరీక్షలు నిర్వహించారు. కొంతమందిని ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే తాజాగా మరో కరోనా కేసు వైట్‌ హౌస్‌లో వెలుగు చూసింది. గత మూడు రోజుల క్రితం జోబైడెన్‌తో ప్రయాణించిన తన పాలన యంత్రాంగంలోని ఓ వ్యక్తి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది.

అయితే కరోనా సోకిన ఉద్యోగి బైడెన్‌ వద్ద 30 నిమిషాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే బైడెన్‌కు సైతం వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా పరీక్షల్లో బైడెన్‌కు నెగిటివ్‌ వచ్చినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. అంతేకాకుండా బుధవారం మరోసారి బైడెన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Exit mobile version