Site icon NTV Telugu

ప్ర‌పంచాన్ని చుట్టేస్తున్న ఒమిక్రాన్ …

గ‌త రెండేళ్లుగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని అతలాకుత‌లం చేస్తున్న‌ది.  త‌గ్గిన‌ట్టే త‌గ్గి వైరస్ కొత్త‌గా మార్పులు చెంది ఎటాక్ చేస్తున్నది.  తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా ప్ర‌పంచంలోని దేశాలను చుట్టేస్తున్న‌ది.  సౌతాఫ్రికాలో ప్రారంభ‌మైన ఈ వేరియంట్ ఇప్ప‌టికే సుమారు వంద‌కు పైగా దేశాల్లో విస్త‌రించింది.  ముఖ్యంగా యూర‌ప్ దేశాల్లో ఒమ‌క్రాన్ కార‌ణంగా క‌రోనా కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి.   రెండు రోజుల్లోనే ఒమిక్రాన్ కేసులు డ‌బుల్ స్థాయిలో న‌మోద‌వుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. బ్రిట‌న్‌, ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, డెన్మార్క్, ఐర్లాండ్ త‌దిత‌ర దేశాల్లో భారీ స్థాయిలో కేసులు న‌మోద‌వుతున్నాయి.  అమెరికాలోనూ కేసుల సంఖ్య భారీగా పెరిగింది.  

Read: అఫీషియల్… టెస్టులకు వైస్‌ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

నిన్న ఒక్క‌రోజే అమెరికాలో 1.4 ల‌క్ష‌ల కేసులు న‌మోద‌య్యాయి.  ఈ ఏడాది జ‌న‌వ‌రి త‌రువాత ఈ స్థాయిలో కేసులు పెర‌గ‌డం ఇదే మొద‌టిసారి.  కేసులు పెరుగుతుండ‌టంతో మ‌రోసారి అంక్ష‌లు విధించే అవ‌కాశం ఉన్న‌ట్టు నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా ప్ర‌స్తుతానికి మ‌ర‌ణాల సంఖ్య న‌మోదుకావ‌డంలేదు.  యూకేలో ఒక్క‌టే ఒమిక్రాన్ మ‌ర‌ణం సంభ‌వించింది.  ఆస్ట్రేలియాలోనూ ఇదేవిధ‌మైన ప‌రిస్థితి నెల‌కొన్న‌ది.  జ‌నసాంధ్ర‌త అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి.    

Exit mobile version