Site icon NTV Telugu

ఒమిక్రాన్ టెన్ష‌న్‌: మ‌ళ్లీ రాత్రి క‌ర్ఫ్యూ విధిస్తారా?

దేశంలో ఒమిక్రాన్ టెన్ష‌న్ మొద‌లైంది.  ఒమిక్రాన్ కేసులు చాప‌కింద నీరులా వ్యాపిస్తున్నాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో కేంద్రం అప్ర‌మ‌త్తం అయింది.  ఒమిక్రాన్ కేసుల‌తో పాటుగా క‌రోనా కేసులు కూడా వ్యాప్తి చెందుతుండ‌టంతో కేంద్ర ఆరోగ్య‌శాఖ కేంద్రాల‌కు లేఖ‌లు రాసింది.  కోవిడ్ నిబంధ‌న‌ల‌పై నిర్ల‌క్ష్యం వ‌ద్ద‌ని, క‌రోనా వ్యాప్తి చెందుతున్న జిల్లాల‌పై మ‌రింత దృష్టి సారించాల‌ని కేంద్రం సూచించింది.  దేశంలోని 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో  గ‌త రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోంద‌ని, దీనిపై దృష్టి పెట్టాల‌ని సూచించారు.  

Read: టాలీవుడ్‌ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు

కేర‌ళ‌, సిక్కిం, మిజోరాం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో పాజిటివిటి రేటు 10 శాతం కంటే ఎక్కువ‌గా ఉంద‌ని, మిగ‌తా ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటి రేటు 5 నుంచి 10 శాతంగా న‌మోదవుతున్న‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది.  జిల్లాల్లో కేసులు పెరిగితే చ‌ర్య‌లు చెప‌ట్టాల‌ని, ప‌రీక్ష‌లు, వ్యాక్సినేష‌న్ పెంచాల‌ని, అవ‌స‌ర‌మైతే నైట్ క‌ర్ఫ్యూలు విధించాల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ రాష్ట్రాల‌కు సూచించింది.  

Exit mobile version