NTV Telugu Site icon

యూర‌ప్‌ను వ‌ణికిస్తున్న ఒమిక్రాన్‌… ఫ్రాన్స్‌లో ఆరోవేవ్‌…

ప్ర‌పంచం మొత్తం ఇప్పుడు ఒకటే భ‌యం ప‌ట్టుకుంది.  ద‌క్షిణాఫ్రికాలో మొద‌లైన ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌పంచం మొత్తం చుట్టేసింది.  అత్యంత వేగంగా ఈ వేరియంట్ వ్యాపిస్తోంది.  సౌతాఫ్రికాలో మొద‌లైన‌ప్ప‌టికీ ఈ వేరియంట్ కేసులు యూరప్‌లో వేగంగా వ్యాపిస్తున్నాయి.  ముఖ్యంగా బ్రిట‌న్‌లో రోజుకు వంద‌ల సంఖ్య‌లో ఈ వేరియంట్ కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.  ఇప్ప‌టికే సుమారు మూడు వేల‌కు పైగా కేసులు బ్రిటన్‌లో న‌మోదైన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.  క్ర‌మంగా ఆసుప‌త్రులపై ఒత్తిడి పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  

Read: అనుకున్న‌ట్టే జ‌రిగింది: తైవాన్ ను ఆహ్వానించి… చైనాకు భ‌య‌ప‌డి అమెరికా…

ఏప్రిల్ నాటికి బ్రిట‌న్‌లో మ‌ర‌ణాల సంఖ్య 75 వేల‌కు చేరే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  ఇక యూర‌ప్‌లో కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  ఫ్రాన్స్‌లోనూ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  జ‌న‌వ‌రి నుంచి ఫ్రాన్స్‌లో ఆరోవేవ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.  ఆరోవేవ్ మొద‌లైతే తీవ్ర‌త మ‌రింత తీవ్రంగా ఉండే అవ‌కాశం ఉందని, శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు.  యూర‌ప్ మొత్తంమీద శీతాకాలం ముగిసే స‌మ‌యానికి సుమారు 7 ల‌క్ష‌ల మంది మృతి చెందే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.