Site icon NTV Telugu

66 దేశాలకు పాకిన ఒమిక్రాన్‌.. పలు దేశాల్లో ఆంక్షలు

ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా మహమ్మారి మరోసారి రూపం మార్చుకొని ప్రజలపై విరుచుకు పడుతోంది. గత నెల దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ 66 దేశాలకు వ్యాప్తి చెందింది. డెల్టా వేరియంట్‌ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్‌ ఇటీవల భారత్‌లోకి కూడా ప్రవేశించింది. దీంతో ప్రస్తుతం భారత్‌లో 33 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో కూడా ఒమిక్రాన్‌ వ్యాప్తి అధికంగా ఉండడంతో నిన్న, నేడు ఆ రాష్ట్రంలో 144 సెక్షన్‌లు అమలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 5,634 ఒమిక్రాన్‌ కేసులు కావడంతో పలు దేశాల్లో ఆంక్షలు విధించారు. యూకేలో 1,898, డెన్మార్క్‌లో 1,840, సౌతాఫ్రికాలో 633, యూఎస్‌లో 115, నార్వేలో 109 చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

Exit mobile version