Site icon NTV Telugu

46 దేశాలకు పాకిన ఒమిక్రాన్‌..

కరోనా మహమ్మారి విజృంభన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ రూపంలో మరోసారి మొదలైంది. ఇప్పటికే 38 దేశాలకు వ్యాప్తి చెందిన ఈ వేరియంట్‌ కొత్త నివేదికల ప్రకారం ఇప్పుడు 46 దేశాలకు పాకింది. ఇప్పుడిప్పుడే డెల్టా వేరియంట్‌ నుంచి కోలుకుంటన్న తరుణంలో దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా 941కి ఒమిక్రాన్ బాధితుల సంఖ్య చేరింది.

యూకేలో 246 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా, దక్షిణాఫ్రికాలో 228, జింబాబ్వేలో 50, యూఎస్‌లో 39 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అయితే భారత్‌లో కూడా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 21కి చేరింది. నిన్న ఒక్కరోజే 17 కేసులు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్‌పై మరింత దృష్టి సారించాలని వైద్యారోగ్య శాఖకు సూచనలు చేసింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒమిక్రాన్‌ను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించాయి.

Exit mobile version