NTV Telugu Site icon

ఆ వీడియో మ‌ళ్లీ వైర‌ల్‌…

ప్ర‌పంచంలో అత్య‌థిక ప్రజాధ‌ర‌ణ పొందిన గేమ్ ఫుట్‌బాల్.  ఈ గేమ్ అంటే మ‌నుషుల‌కే కాదు జంతువుల‌కు కూడా ఇష్ట‌మే.  అప్పుడప్పుడూ అవి కూడా ఫుడ్‌బాల్ గేమ్ అడుతూ వాటిలోని ప్ర‌తిభ‌ను బ‌య‌ట‌పెడుతుంటాయి.  2019లో ఓ దుప్పి త‌న త‌ల‌తో ఫుట్‌బాల్ గేమ్ ఆడి గోల్ చేసింది.  బాల్‌ను గోల్‌లోకి పంపిన త‌రువాత ఆనందంతో ఎగిరి గంతులేసి అక్క‌డి నుంచి వెళ్లిపోయింది.  

Read: భార‌త్‌లో పెరిగిపోతున్న స్పామ్ కాల్స్‌… ఆ నెంబ‌ర్ నుంచి 20 కోట్ల సార్లు కాల్…

దీనికి సంబంధించిన వీడియో అప్ప‌ట్లో ట్విట్ట‌ర్ లో పోస్ట‌య్యి వైర‌ల్ అయింది.  అప్ప‌ట్లో ఇంట‌ర్నెట్‌ను షేక్ చేసిన ఆ వీడియోను స్టీవ్ స్టీవార్ట్ విలియ‌మ్స్ అనే వ్య‌క్తి ట్విట్ట‌ర్లో పోస్ట్ చేశాడు.  నో బిగ్ డీల్‌… జ‌స్ట్ డీర్ స్కోరింగ్ అంటూ ట్వీట్ చేశాడు.  ఈ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. వీడియో పాత‌దే కానీ, మ‌రోసారి పోస్ట్ కావ‌డంతో వైర‌ల్‌గా మారింది.