దేశంలో చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఇప్పటికే అనేక స్టార్టప్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సమస్య కీలకం. బ్యాటరీని ఛార్జింగ్ చేయాలి అంటే కనీసం రెండు మూడు గంటల సమయం పడుతుంది. ఈ సమస్యను అధికమించేందుకు ఓలా కంపెనీ భారత్ పెట్రోలియం లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నది. దేశంలోని నాలుగు వేలకు పైగా ఉన్న భారత్ పెట్రోలియం బంకుల్లో ఓలా కంపెనీ విద్యుత్ ఛార్జర్లను ఏర్పాటు చేసింది.
Read: కేంబ్రిడ్జ్ షాకింగ్ సర్వే: ఇండియాలో మరికొన్ని రోజుల్లో…
ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆ పాయింట్ల వద్ద ఉచితంగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చని ఓలా సంస్థ తెలియజేసింది. మరో 6 నుంచి 8 వారాల్లో రోజుల్లో దేశంలోని అన్ని భారత్ పెట్రోల్ బంకుల్లో ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుందని తెలిజేసింది. 2022 జూన్ 30 వ తేదీ వరకు ఉచితంగా చార్జింగ్ పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఓలా సీఈవో భవానీ అగర్వాల్ తెలిపారు. ఓలా సంస్థ హైపవర్ ఎలక్ట్రిక్ ఛార్జర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే ఆథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల సంస్థ పబ్లిక్ పాయింట్ల వద్ధ ఎలక్ట్రిక్ ఛార్జర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
