మేషం : ఈ రోజు ఈ రాశిలోని చేతివృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. కొన్ని అనుకోని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి.
వృషభం : ఈ రోజు ఈరాశివారికి ప్రైవేటు సంస్థల్లో సదవకాశాలు లభిస్తాయి. బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. ఇతరులకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. సేవ, సందర్భానికి అనుగుణంగా మీ కార్యక్రమాలు, పనులు మార్చుకుంటారు.
మిథునం : ఈ రోజు ఈరాశివారికి ఆర్థిక విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. వాహనం నడుపునపుడు మెళకువ చాలా అవసరం.
కర్కాటకం : ఈ రోజు మీరు ఆలయాలను సందర్శిస్తారు. మీ సంతానం మొండివైఖరి మీపై ఎంతో ఒత్తిడి పెంచి, చికాకు కలిగిస్తుంది. రాజకీయ నాయకులు తరచు సభా సమావేశాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. మీకు నచ్చని సంఘటనలు జరుగుతాయి. అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కుంటారు.
కన్య : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. స్నేహ పరిచయాలు విస్తరిస్తాయి. ఒక వ్యవహారంలో సోదరుల నుండి పట్టింపులు, వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది. వృత్తుల్లో వారికి టెక్నికల్ రంగాల్లో వారికి అధిక ఒత్తిడి, చికాకు తప్పదు.
తుల : ఈ రోజు ఈ రాశిలోని వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, బహమతులు అందుతాయి.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారికి అకాల భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత వహించినా సత్ఫలితాలు పొందగలరు. అందరితోను కలుపుగోలుగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది.
ధనస్సు : ఈ రోజు మీరు ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తులు, మార్కెట్ రంగాల వారికి శ్రమ అధికం, ఆదాయం స్వల్పం. మీ అంచనాలు, పథకాలు బెడిసికొట్టే ఆస్కారం ఉంది. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. బంధు మిత్రులు మీ వైఖరిని తప్పు పడతారు.
మకరం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయనాయకులు తరచు సభాసమావేశాలలో పాల్గొంటారు. రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానరాగలదు. స్త్రీలకు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి.
కుంభం : ఈ రోజు మీరు ఇతరులపై ఆధారపడక మీ పనులు మీరే చేసుకోవటం మంచిది… దూరప్రదేశంలోని ఆత్మీయులు, సంతానంతో సంభాషిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించటం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. రాబోయే అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు చేసుకుంటారు.
మీనం : ఈ రోజు ఈ రాశివారి ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ ఏమరుపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి.
