ఐపీఎల్ మ్యాచులకు ఉన్న క్రేజ్ గురించిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఐపీఎల్ మ్యాచ్ లను చూస్తున్నారు. ఐపీఎల్ లో ఉన్న టీమ్‌లకు అభిమానులు ఎక్కువ. తాజాగా జరుగుతున్న సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా ఓ చిన్నారి ప్లకార్డు పట్టుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read:US Journalist: డోనాల్డ్ ట్రంప్ లైంగికంగా వేధించాడు.. US జర్నలిస్ట్ జీన్ కారోల్ ఆరోపణ
RCB జెర్సీని ధరించిన చిన్నారి, “RCB IPL గెలిచే వరకు పాఠశాలలో చేరను” అని రాసి ఉన్న ప్లకార్డ్‌ని పట్టుకుని స్టేడియంలో సందడి చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సోషల్ మీడియాతో తీవ్ర చర్చ మొదలైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది 2007లో ప్రారంభమైన పురుషుల ట్వంటీ20 క్రికెట్ లీగ్. అప్పటి నుండి, RCB ఏ సీజన్‌లోనూ గెలవలేదు. ఈ నేపథ్యంలోనే చిన్నారి ఆర్సీబీ గెలిచే వరకు తాను స్కూల్‌కు వెళ్లనని పట్టుబట్టింది. బెంగళూరు జట్టు గెలిస్తే తప్ప పాఠశాలకు వెళ్లనని చిన్నారి ప్లకార్డ్ పట్టుకుని ప్రతిజ్ఞ చేసింది. చిన్నారి ఫోటోపై నెటిజన్లు ఆసక్తికరంగ ఆస్పందిస్తున్నారు. వివిధ కామెంట్లు కూడా చేస్తున్నారు. చిన్నారి కోసమైన ఆర్సీబీ మ్యాచ్ గెలవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
RCB fans pic.twitter.com/594s2CyCmh
— Dr Gill (@ikpsgill1) April 27, 2023
Dear RCB, please win IPL for your fans ❤ pic.twitter.com/0PHQoyshQe
— leisha (@katyxkohli17) April 26, 2023
