టోక్యో పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో రజత పతకం వచ్చి చేరింది. హైజంప్ లో అథ్లెట్ నిషాద్ కుమార్ ఈ పతకాన్ని సాధించారు. ఈ పతకం సాధించే సమయంలో 2.06 మీటర్లతో నిషాద్ కుమార్ ఆసియా గేమ్స్ రికార్డు ను బ్రేక్ చేసాడు. అయితే ఈ హైజంప్ లో యూఎస్ అథ్లెట్ 2.15 స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అయితే రజతం సాధించిన నిషాద్ కుమార్ కు ట్విట్టర్ వేదికగా ప్రధాని మొదటి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఒలంపిక్స్ లో భారత్ మొత్తం 7 పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నిషాద్ కుమార్ రజతం తో పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో రెండు రజత పతకాలు వచ్చి చేరాయి.
అయితే ఈరోజే మొదటి పతకాన్ని భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ గోల్డ్ మెడల్ కోసం జరిగిన పోరులో ఓటమి కారణంగా రజతం సాధించిన విషయం తెలిసిందే. అయితే గత పారాలింపిక్స్ హైజంప్ పోటీలో భారత్ స్వర్ణం, కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే.