ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ కు సంబంధించి ఎలాంటి న్యూస్ అయినా సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. గత కొన్ని నెలలుగా కిమ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే మీడియాలో ఆయన కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నార్త్ కొరియా అధికారులు ఖండిస్తూ వస్తున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా కిమ్ సన్నబడిపోయారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ది నేషనల్ ఇంటిలిజెన్స్ సర్వీసెస్ ఏజెన్సీ కీలక వివరాలను వెల్లడించింది. కిమ్ తన దేహదారుడ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారని, ఇందులో భాగంగానే ఆయన సన్నబడ్డారని, 20 కిలోల వరకు బరువు తగ్గారని ఎన్ఐఎస్ ఆ దేశ చట్టసభలకు తెలియజేసింది. 2019లో కిమ్ 140 కిలోల బరువు ఉండగా, ఇప్పుడు 20 కేజీల బరువు తగ్గినట్టు ఎన్ఐఎస్ తెలియజేసింది.
Read: మ్యాన్‌హోల్‌పై పిల్లల ప్రయోగం… తృటిలో తప్పిన ప్రమాదం…
