NTV Telugu Site icon

Spy Movie Review: ‘స్పై’ మూవీ హిట్ అయినట్లేనా?

Nikhil Spy Movie

Nikhil Spy Movie

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీ హీరోగా మారిపోయాడు. నిఖిల్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ స్పై. గ్యారీ బీహెచ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. ఈ సినిమా ఈరోజు థియేటర్లలో సందడి చేస్తుంది..నిఖిల్ సరసన తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రిలీజ్ అయినప్పటికీ ఎక్కువగా ప్రమోషన్స్ కూడా కనిపించలేదు.. ఎటువంటి హంగామా లేకుండా విడుదల అవుతుంది…ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. స్పై మూవీ ఒక గూఢచారి కథ మాత్రమే కాదు ఇందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ గురించి కూడా ఆసక్తికర అంశాలు చర్చిస్తుండడంతో అందరిలో ఆసక్తి పెరిగింది.

కాగా, ఆల్రెడీ యుఎస్ లో స్పై మూవీ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి.. ఆ సినిమా టాక్ వచ్చేసింది..ఈ సినిమా మొత్తం ట్రైలర్ లో చూపించిన విధంగానే ఒక్కక్క ఏజెంట్ పాత్రని పరిచయం చేస్తూ వారి టార్గెట్స్ ని ఫిక్స్ చేస్తుంటారు. ఆరంభంలోనే ప్రతి ఏజెంట్ కి వాళ్ళు దేనికోసం పనిచేయబోతున్నారో అర్థం అవుతుంది. అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ కూడా మొదలవుతాయి. ఈ చిత్రం గ్రాండ్ గా మొదలైనప్పటి తర్వాత స్టోరీ డల్ అయ్యిందని సమాచారం..

సినిమా ఫస్ట్ హాఫ్ లో చెప్పుకోదగ్గ గొప్ప మూమెంట్స్ అంటూ లేవు.. నేతాజీ కి సంబంధించిన సీన్స్ తప్ప. ఇక నిఖిల్ తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు.. రెగ్యులర్ స్పై టెంప్లేట్ లోనే దర్శకుడు గ్యారీ బి హెచ్ ఈ చిత్రాన్ని డీల్ చేశారు. ఆసక్తికరమైన కొర్ పాయింట్ ఉన్నప్పటికీ మంచి హైప్ ఇచ్చే సీన్లు ఎక్కడ లేవని చెప్పాలి.. సినిమా అంతా స్లోగా నడిచిందని వార్తలు వినిపిస్తున్నాయి..

ఇక సెకండ్ హాఫ్ లో కూడా దాదాపు పరిస్థితి అంతే. సుభాష్ చంద్రబోస్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొన్ని చాలా బాగా వచ్చాయి. అలాగే మరికొన్ని ఎంగేజింగ్ మూమెంట్స్ ఉన్నాయి. మిగిలిన సమయం మొత్తం ఆడియన్స్ కి బోర్ కొట్టించే విధంగా తెరకెక్కించారు. సినిమా గ్రాఫ్ ఫ్లాట్ గా ఉంటుంది..కార్తికేయ సినిమా లాగా సస్పెన్స్ కనిపించలేదని కొంతమేర నిరాశను కలిగించిందని తెలుస్తుంది..మంచి ప్రొడక్షన్ వాల్యూస్, డీసెంట్ గా అనిపించే బిజియం.. స్పై గా నిఖిల్ అందించిన పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో ప్రధాన హైలైట్ అని చెప్పొచ్చు. దర్శకుడి వైపు నుంచి బలమైన ఎఫోర్ట్ కనిపించకపోవడంతో స్పై మూవీ రెగ్యులర్ గూఢచారి కథగా యావరేజ్ గా అనిపిస్తుంది. సుభాష్ చంద్రబోస్ అంశంపై ఉన్న ఆసక్తిని ఉపయోగించుకుని బలమైన చిత్రంగా తీర్చిదిద్ది ఉంటే సినిమా రేంజ్ మరోలా ఉండేది.. మరి జనాలను ఏ విధంగా ఆకట్టుకుందో చూడాలి.. నిఖిల్ ఖాతాలో హిట్ పడిందో లేదో తెలియాలంటే సినిమా సాయంత్రం వరకు వెయిట్ చెయ్యాల్సిందే..