Site icon NTV Telugu

ఒమిక్రాన్‌ టెన్షన్‌.. కర్ణాటకలో నైట్‌ కర్ఫ్యూ..

Night curfew in Karnataka

ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ఇండియాలో కూడా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదవుతున్నాయి. కరోనా ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌లతో ప్రజలు, ప్రభుత్వాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తే ఆర్థిక రాష్ట్రాల్లో కురుకుపోయే ప్రమాదం లేకపోలేదు.

ఇటు చూస్తే ఒమిక్రాన్‌ వేరియంట్‌ డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కర్ణాటకలో నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నెల 28 నుంచి 10 రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కర్ణాటకలో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒమిక్రాన్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. సామూహిక కార్యక్రమాలపై ఆంక్షలు కూడా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

https://ntvtelugu.com/newly-6987-corona-cases-in-india-26-12-2021/
Exit mobile version