NTV Telugu Site icon

తెలంగాణ, కేంద్రానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు అంశం మళ్ళీ తెరమీదకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై అధ్యయనం చేసి 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్ హెచ్ ఆర్సీ ఆదేశించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపు అధికంగా ఉందంటూ ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేశారు న్యాయవాది శ్రావణ్. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ఇటీవల 30 నుంచి 40వేల ఎకరాలు పంట నష్టం జరిగిందన్నారు. పంట నష్టంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న రైతు అంశాన్ని శ్రావణ్‌ ఎన్‌హెచ్‌ఆర్సీకి తెలిపారు. ఈ విషయాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీకి తెలపడంతో తీవ్రంగా స్పందించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపుపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి ఏం చర్యలు తీసుకున్నారో నివేదికను (ఏటిఆర్) అందజేయాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు ఎన్ హెచ్ ఆర్సీ ఆదేశాలు జారీచేసింది.