ముంబై టెస్టులో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అజాజ్ పటేల్ చరిత్రకెక్కాడు. గతంలో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ 1956లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాపై 10కి 10 వికెట్లు సాధించగా.. 1999లో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పాకిస్థాన్‌పై ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ స్పిన్నర్ మళ్లీ ఆ ఘనత సాధించి మూడో క్రికెటర్‌గా నిలిచాడు.
Read Also: దక్షిణాఫ్రికా పర్యటనకు బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్.. టీ20 సిరీస్ వాయిదా
ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 325 పరుగులకు ఆలౌట్ కాగా.. అన్ని వికెట్లు అజాజ్ పటేల్ ఖాతాలోకే వెళ్లాయి. మొత్తం 47.5 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన అజాజ్… 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లను నేలకూల్చాడు. మయాంక్ అగర్వాల్ 150 పరుగులతో తన సత్తా చాటాడు. అతడికి అక్షర్ పటేల్ (52) సహకారం అందించడంతో భారత్ స్కోరు 300 పరుగులు దాటింది. మయాంక్, అక్షర్ పటేల్ తర్వాత అత్యధిక స్కోరు చేసింది శుభ్‌మన్ గిల్ (44) మాత్రమే.
