NTV Telugu Site icon

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. తెలంగాణలో పట్టాలెక్కనున్న కొత్త పథకం

cm kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరో కొత్త పథకం ప్రవేశపెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన కోసం బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ‘బడుల బాగు’ పథకం త్వరలోనే పట్టాలెక్కనుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ గురువారం ఈ పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ఏడాదికి రూ.2000 కోట్ల చొప్పున రెండేళ్లలో రూ.4000 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు గత బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే ఈ పథకాన్ని కేబినెట్‌లో పెట్టి ఆమోదం తెలిపి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.

Read Also: బాలయ్యకు హీరోయిన్ సాష్టాంగ నమస్కారం

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో.. ఆయా కాలేజీల్లో ఏవేం కోర్సులు ఉన్నాయో మ్యాపింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.