Site icon NTV Telugu

కొత్త నిబంధ‌న‌లు: రెండు డోసులు తీసుకున్నా ఆ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి…

మ‌హ‌మ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకొక‌ముందే మ‌ర‌లా మ‌హ‌మ్మారి కేసులు పెరుగుతున్నాయి.  వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ, రెండు డోసులు తీసుకున్న‌ప్ప‌టికీ కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి.  వ్యాక్సిన్ తీసుకున్న‌వారికి కూడా క‌రోనా వ‌స్తుండ‌టంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న‌ల మొద‌లైంది.  ఇక‌, క‌రోనా స‌మ‌యంలో అమెరికా ఎన్ని ఇబ్బందులు ప‌డిందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  వ్యాక్సిన్‌ను వేగంగా అమ‌లు చేస్తున్నా అక్క‌డ కేసులు న‌మోద‌వుతున్నాయి.  ఇక‌, ఇదిలా ఉంటే, అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల ఆంక్ష‌ల‌ను ఇప్ప‌టికే బైడెన్ ప్ర‌భుత్వం స‌డ‌లించింది.  అంత‌ర్జాతీయంగా కేసులు న‌మోదువుతున్న నేప‌థ్యంలో ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తూనే కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌ల్లోకి తీసుకొచ్చింది.  యూఎస్ ఎఫ్‌డీఏ, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తులు పొందిన వ్యాక్సిన్ ను తీసుకోవ‌డంతో పాటుగా, క‌రోనా నెగెటివ్ స‌ర్టిఫికెట్‌ను త‌ప్ప‌నిస‌రి చేసింది.  18 ఏళ్లు పైబ‌డిన వ్య‌క్తులు త‌ప్ప‌ని స‌రిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి, అదే విధంగా ప్ర‌యాణానికి ముందు క‌రోనా నెగెటివ్ స‌ర్టిఫికెట్ తీసుకొని ఉండాల‌ని ప్ర‌భుత్వం సూచించింది.  కొత్త నిబంధ‌న‌లు న‌వంబ‌ర్ 8 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి.  

Read: క‌రోనాతో ర‌ష్యా విల‌విల‌… రికార్డ్ స్థాయిలో మ‌ర‌ణాలు న‌మోదు…

Exit mobile version