క‌రోనాతో ర‌ష్యా విల‌విల‌… రికార్డ్ స్థాయిలో మ‌ర‌ణాలు న‌మోదు…

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తూనే ఉన్న‌ది.  త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌రింత బ‌ల‌ప‌డి విరుచుకుప‌డుతున్న‌ది.  ప్ర‌స్తుతం ర‌ష్యాలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు రికార్డ్ స్థాయిలో న‌మోద‌వుతున్నాయి.  ప్ర‌తిరోజూ 30 వేల‌కు పైగా కేసులు, వెయ్యికిపైగా మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి.  క‌ట్ట‌డికి క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నా కేసులు త‌గ్గ‌డం లేదు.  తాజాగా ర‌ష్యాలో 36,446 కేసులు న‌మోద‌వ్వ‌గా, రికార్డ్ స్థాయిలో 1106 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.  ప్ర‌తిరోజూ వెయ్యికిపైగా మ‌ర‌ణాలు సంభ‌విస్తుండ‌టంతో క‌ట్టడి చేసేందుకు అక్టోబ‌ర్ 30 నుంచి న‌వంబంర్ 6 వ‌ర‌కు వారం రోజుల‌పాటు దేశవ్యాప్తంగా సెల‌వులు ప్ర‌క‌టించింది. ప్ర‌జ‌లు అత్య‌వ‌స‌ర‌మైతే బ‌య‌ట‌కు రావొద్ద‌ని, వ్యాక్సిన్ త‌ప్పనిస‌రిగా తీసుకోవాల‌ని, మాస్క్ వినియోగించాల‌ని పుతిన్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను కోరింది.  60 ఏళ్లు పైబ‌డిన వ్య‌క్తులు, చిన్న‌పిల్ల‌లు బ‌య‌ట‌కు రావొద్ద‌ని హెచ్చ‌రించింది.

Read: అక్టోబ‌ర్ 27, బుధ‌వారం దిన‌ఫ‌లాలు

Related Articles

Latest Articles