Site icon NTV Telugu

అల‌ర్ట్‌: జ‌న‌వ‌రి 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్‌….

ప‌న్ను చెల్లింపుల విష‌యంలో కేంద్రం కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌ల్లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్న‌ది.  జ‌న‌వ‌రి 1, 2022 నుంచి ఈ నిబంధ‌న‌లు అమ‌లుకాబోతున్నాయి.  ఆర్థిక చ‌ట్టం 2021లో భాగంగా స‌వ‌ర‌ణ‌లు చేస్తున్నారు.  దీంతో ప‌రోక్ష ప‌న్ను విధానం మ‌రింత కఠినం కాబోతున్నాయి. వార్షిక టర్నోవ‌ర్ రూ. 5 కోట్లకు పైన ఉన్న కంపెనీ జీఎస్టీఆర్ 1, జీఎస్టీఆర్ 3బీ దాఖ‌లు చేయాల్సి ఉంటుంది.  జీఎస్టీఆర్ 1 అనేది సేల్స్ ఇన్వాయిస్ చూపించే రిట‌ర్న్‌, జీఎస్టీఆర్ 3బీ అనేది జీఎస్టీఆర్ 1లో చూపించిన రిట‌ర్న్స్ కు సంబంధించి ప్ర‌తి నెలా దాఖ‌లు చేసే స్వీయ ప్ర‌క‌టిత జీఎస్టీ రిట‌ర్న్‌.  ఒక‌వేళ ఈ రెండింటి మ‌ధ్య స‌రిపోకుండా రిట‌ర్న్ దాఖ‌లు చేస్తే ఆ మేర‌కు జీఎస్టీని ప‌న్ను అధికారులు రిక‌వ‌రీ చేస్తారు.  ఈ కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం రిక‌వ‌రీ కోసం ఎలాంటి నోటీసులు అందించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.  

Read: ఒమిక్రాన్ అల‌ర్ట్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం…

Exit mobile version