పాకిస్తాన్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా ఆ దేశంలో కొత్త వేరియంట్ బయటపడింది. ఈ వేరియంట్ కేసులు అధిక సంఖ్యలో నమోదువుతున్నాయి. ఎప్సిలాన్ వేరియంట్‌గా పిలిచే ఈ కోవిడ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. మొదట ఈ వేరియంట్‌ను క్యాలిఫోర్నియాలో గుర్తించారు. దీనిని క్యాలిఫోర్నియా స్ట్రెయిన్ లేదా బి 1.429 గా పిలుస్తారు. ఈ వేరియంట్ యూఎస్, యూకేలో వ్యాప్తి చెందింది. యూకేలో అత్యధిక కేసుతు ఈ వేరియంట్ ద్వారా ప్రస్తుతం నమోదవుతున్నాయి. ఈ ఎప్సిలాన్ లో ఐదు వేరియంట్లను గుర్తించారు. అదే విధంగా ఏడు మ్యూటేషన్లను కూడా పాక్‌లో గుర్తించారు. జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని పాక్ ఆరోగ్యశాఖ తెలియజేసింది.
పాక్‌లో మరో కొత్త వేరియంట్…
