NTV Telugu Site icon

భ‌య‌పెడుతున్న మ‌రో కొత్త క‌రోనా వేరియంట్‌…

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతున్న‌ది.  ప్ర‌తిరోజూ ల‌క్ష‌ల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి.  వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అమ‌లు చేస్తున్నా కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న చెందుతున్నాయి.  ఎలా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయాలో తెలియ‌క ఆందోళ‌న చెందుతున్నారు.  ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు మ‌రో వేరియంట్ ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతున్న‌ది.  సి 1.2 వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న‌ట్టు దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాదుల సంస్థ పేర్కొన్న‌ది.  ఈ సీ 1.2 ను మొద‌ట‌గా మే నెల‌లో ద‌క్షిణాఫ్రికాలో గుర్తించారు.  సి 1 కంటే ఈ సీ 1.2 వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని, ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ల‌ను త‌ట్టుకొని నిల‌బ‌డే విధంగా జ‌న్యుమార్పిడి జ‌రుగుతుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  ఇక ఈ సీ 1.2 వేరియంట్‌ను చైనా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మారిషస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ గుర్తించారు.  ఇప్ప‌టి వ‌ర‌కు క‌నుగొన్న వేరియంట్ల కంటే ఈ సీ 1.2 వేరియంట్ 41.8 శాతంగా ఉన్న‌ట్టు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  

Read: యాపిల్ ఐఫోన్ 13: నెట్ వ‌ర్క్ లేకున్నా ఫోన్ కాల్స్ చేసుకొవ‌చ్చు…