NTV Telugu Site icon

పెళ్లికి వ‌థువు వెరైటీ కండీష‌న్స్‌… షాకైన బంధువులు…

పెళ్లంటే నూరేళ్ల పంట‌.  పెళ్లి అన‌గానే హడావుడి, బంధువులు, పెద్ద ఫంక్ష‌న్, పెద్ద ఎత్తున భోజ‌నాలు, ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు.  అట్ట‌హాసంగా చేసుకోవాల‌ని అనుకుంటారు.  జీవితంలో ఒక్క‌సారి మాత్ర‌మే వ‌చ్చే వేడుక కావ‌డంతో అలా చేసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకుంటారు.  కానీ, ఈ యువ‌తి మాత్రం అందుకు విరుద్దంగా చేసింది.  పెళ్లికి కొత్త కొత్త కండీష‌న్స్ పెట్టింది.  ఆమె కండీష‌న్స్ విని బంధువులు షాక‌య్యారు.  ఇదెక్క‌డి విడ్డూరంరా బాబోయ్ అని నోర్లు మూసుకొని వ‌చ్చిన దారినే వెళ్లిపోయారు.  ఇంత‌కీ ఆ వ‌థువు పెట్టిన కండీష‌న్స్ ఎంటో తెలుసా… తెలుసుకుందాం.  

Read: వైర‌ల్‌: పాముతో యువ‌తి ముద్దులు… షాకైన నెటిజన్లు…

పెళ్లికి బంధువులు అంద‌రూ రావాలి.  అయితే, వ‌చ్చే ట‌ప్పుడు వారి ఖ‌ర్చులు వారే పెట్టుకోవాలి.  పెళ్లికి వ‌చ్చిన త‌రువాత వారి మేక‌ప్ వారే చేసుకోవాలి.  వారి డ‌బ్బులు వారివే.  అలానే పెళ్లిలో బ్రేక్ ఫాస్ట్ నుంచి భోజ‌నాల వ‌ర‌కు ఎవ‌రి డ‌బ్బులు వారివే.  ఎవ‌రి ఫుడ్ వారిదే అని కండీష‌న్లు పెట్టింది.  తాను ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చుచేయ‌న‌ని చెప్పింది.  దీంతో బంధువులు ఇదెక్క‌డి పెళ్లండి బాబు అని ముక్కున వేలు వేసుకున్నారు.  శుభ‌మా అని పెళ్లి జ‌రుగుతుంటే ఈ కండీష‌న్లు ఎంట‌ని తిట్టిపోస్తున్నారు.  ఎలాగైతేనేం కండీష‌న్ల పుణ్య‌మా అని పెళ్లి కూతురి పెళ్లి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.