Site icon NTV Telugu

తెలంగాణ‌లో కొత్త‌గా 12 ఒమిక్రాన్ కేసులు…

తెలంగాణ‌లో ఒమిక్రాన్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  రాష్ట్రంలో కొత్త‌గా 12 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి చేరింది.  ఇక ఇదిలా ఉంటే, ఒమిక్రాన్ నుంచి 27 మంది కోలుకున్నట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.  ప్ర‌స్తుతం 52 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  రాష్ట్రంలో కొత్త‌గా 317 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 6,82,215కి చేరింది.  ఇందులో 6,74,453 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,733 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  

Read: భ‌యం గుప్పిట్లో ప్ర‌పంచం… సునామీలా దూసుకొస్తున్న ఒమిక్రాన్‌…

క‌రోనాతో రాష్ట్రంలో ఇద్ద‌రు మృతి చెందిన‌ట్టు తెలంగాణ ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 4,029 మంది క‌రోనాతో మృతి చెందారు.  ఇక కొత్త‌గా న‌మోదైన 12 ఒమిక్రాన్ కేసుల్లో 3 ఎట్ రిస్క్ దేశాల నుంచి, 9 నాన్ రిస్క్ దేశాల వ‌చ్చిన వారిలో బ‌య‌ట‌ప‌డ్డాయి.  

Exit mobile version