2020 కి ముందు ప్రతి ఒక్కరి లైఫ్ డిఫరెంట్‌గా ఉండేది. ఎవరి యాంబీషన్స్ ను వారు రీచ్ అయ్యేందుకు పరుగులు తీస్తుండేవారు. ఎవరికి ఎవరూ సంబంధం లేకుండా, లైఫ్ ను లీడ్ చేస్తూ, టెక్నాలజీని జీవితంలో భాగం చేసుకుంటూ ప్రయాణం చేసేవారు. ఇదంతా 2020 కి ముందు. 2019 డిసెంబర్‌లో చైనాలో కరోనా మహమ్మారి ఎటాక్ చేయడం మొదలయ్యాక ఆ పరుగులు ఆగిపోయాయి. చాలా మంది జీవితాలు వికసించే సమయంలో కరోనా మహమ్మారి వచ్చి కుదేసింది. వికసించాల్సిన జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ తో కాలం గడపాల్సి వచ్చింది. ఇప్పటికీ అలానే గడుపుతున్నారు.
Read: ఒమిక్రాన్‌పై కేంద్రం కీలక వ్యాఖ్యలు…
కరోనా మహమ్మారి మొదలయ్యి రెండేళ్లైనా ఇప్పటి వరకు వదిలిపోలేదు. కొత్త రూపం సంతరించుకొని ఎటాక్ చేస్తున్నది. కొంతమంది నెటిజన్లు తమ పాత జీవితాలకు సంబందించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మళ్లీ ఇలాంటి లైఫ్‌ను జీవితంలో చూడగలమా అంటూ ప్రశ్నిస్తున్నారు. సార్స్ కోవ్ 2, డెల్టా, ఇప్పుడు ఒమిక్రాన్ ఒకదాని తరువాత ఒకటిగా మహమ్మారులు దాడి చేస్తుండటంతో మనిషి ఉక్కిబిక్కిరి అవుతున్నాడు. బలికాకుండా బతికుంటే చాలని భగవంతుడిని వేడుకుంటున్నారు.