Site icon NTV Telugu

బీజేపీకి రూ.వెయ్యి విరాళం ఇచ్చిన మోదీ.. సోషల్ మీడియాలో సెటైర్లు

దేశంలో బీజేపీని బలోపేతం చేసే విషయంపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. ఈ మేరకు బీజేపీ పార్టీ ఫండ్‌కు రూ.1,000 విరాళం ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. బీజేపీని బలోపేతం చేసేందుకు, దేశాన్ని దృఢం చేసేందుకు అందరూ సాయం చేయాలని ప్రజలను ట్విట్టర్ వేదికగా కోరారు. తన వంతుగా రూ.వెయ్యి సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ బలోపేతం అయితే ఇండియా బలోపేతం అయినట్లేనని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

Read Also: టిక్కెట్ రేట్ల ఎఫెక్ట్.. ఏపీలో మూతపడ్డ భారీ స్క్రీన్

అయితే ప్రధాని మోదీ కేవలం రూ.వెయ్యి మాత్రమే పార్టీ ఫండ్‌గా ఇవ్వడంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్‌లు సెటైర్లు వేస్తున్నారు. ప్రధాని హోదాలో ఉండి ఒక పార్టీ కోసం డొనేషన్‌లు ఇవ్వాలని పిలుపునివ్వడం సరికాదని కొందరు విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ బలోపేతాన్ని దేశంతో పోల్చడమేంటని నిలదీస్తున్నారు. ఇది ప్రధాని మోదీకి సిగ్గుచేటని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బీజేపీకి రూ.1,000 విరాళం ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు, అభిమానులందరూ విరాళాలు ఇవ్వాలని, నమో యాప్ ద్వారా చెల్లించవచ్చని అమిత్ షా ట్వీట్ చేశారు.

Exit mobile version