Site icon NTV Telugu

కేజ్రీవాల్ హామీల‌పై వెల్లువెత్తున్న విమ‌ర్శ‌లు…

త్వ‌ర‌లోనే గోవా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఈ ఎన్నిక‌ల్లో కొత్త‌గా తృణ‌మూల్ కాంగ్రెస్‌, ఆప్ పార్టీలు పోటీ చేయ‌బోతున్నాయి.  ఇప్ప‌టికే తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారాన్ని ప్రారంభించింది. కాగా, ఆప్ పార్టీ మ‌రో అడుగుముందుకు వేసి ప్ర‌చారం చేసే కంటే ముందే హామీల వ‌ర్షం కురిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆప్ విజ‌యం సాధిస్తే గోవాలోని ప్ర‌జ‌ల‌ను వారి మ‌తాల‌ను అనుస‌రించి తీర్థ‌యాత్ర‌ల‌కు తీసుకెళ్తామ‌ని ప్ర‌క‌టించింది.  దీనిపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి.  ఎన్నిక‌ల్లో గెల‌పుకోసం ఇలాంటి హామీలు ఇవ్వ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.  

Read: 24 ఏళ్ల నుంచి ఆ విమానం అక్క‌డే…

దేశంలో ఒక ఉన్న‌త అధికారిగా ప‌నిచేసి, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అయిన వ్య‌క్తి ఇలాంటి హామీలు ఎలా ఇస్తున్నార‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.  అవినీతిని ఊడ్చేస్తామ‌ని ఢిల్లీలో అధికారంలోకి వ‌చ్చిన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విస్త‌రించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటోంది.  వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి ఉత్త‌ర‌, ద‌క్షిణ రాష్ట్రాల్లో వీలైనంత వ‌ర‌కు విస్త‌రించి జాతీయ‌పార్టీగా చక్రం తిప్పాల‌ని చూస్తున్న‌ది ఆప్‌.  

Exit mobile version