NTV Telugu Site icon

వైర‌ల్‌: తెలివిలో అది మ‌నిషిని మించిపోయింది…

ప‌రిణామ క్ర‌మం గురించి తెలిసిన వారికి కోతికి, మ‌నిషికి పోలిక‌లు ఉన్నాయ‌ని అర్ధం అవుతుంది.  కోతులు చాలా తెలివైన‌వి.  మ‌నిషిని చాలా ద‌గ్గ‌ర నుంచి ప‌రిశీలిస్తుంటాయి. అవ‌స‌ర‌మైన‌పుడు మ‌నిషి ప్ర‌వ‌ర్తించిన విధంగానే ప్ర‌వ‌ర్తిస్తుంటాయి.  ఓ కోతి ఓ వ్య‌క్తికి సంబంధించిన క‌ళ్ల‌జోడును కొట్టేసి ఇసుప బాక్స్ ఎక్కి కూర్చున్న‌ది.  వెంట‌నే ఆ వ్య‌క్తి వ‌చ్చి త‌న క‌ళ్ల‌జోడు ఇవ్వాల‌ని బ‌తిమిలాడాడు.  కానీ, అందుకు అది నిరాక‌రించింది.  ఎదైనా మాములు ఇస్తేనే ఇస్తాన‌ని అన్న‌ట్టుగా కూర్చొన‌డంతో చేసేతది లేక ఆ వ్యక్తి జ్యూస్ బాక్స్ తెచ్చి ఇచ్చాడు.  ఆ జ్యూస్ బాక్స్ అందుకున్న ఆ కోతి క‌ళ్ల‌జోడును కింద‌కు విసిరేసింది.  ఒక చేత్తో జ్యూస్ తీసుకొని మ‌రోక చేత్తో గ్లాసెస్‌ను కింద‌కు వేసింది.  ఎంతైనా మ‌నిషికి దూర‌పు చుట్టం క‌దా..  ఒక చేత్తో తీసుకోవ‌డం మ‌రోక చేత్తో ఇవ్వ‌డం దానికి తెలుసు.  10 సెకండ్ల నిడివి క‌లిగిన ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.

Read: ఆ లిస్టులో మొన్న‌టి వ‌ర‌కు పాక్‌… ఇప్పుడు ట‌ర్కీకూడా…