Site icon NTV Telugu

Ridhi Bedi: వలపు వల విసిరి.. న్యూడ్ వీడియో కాల్ కి రమ్మంటాడు.. జాగ్రత్త బాసూ!

Arrested

Arrested

N*de Call Scammer Ridhi Bedi Arrested by Hyderabad CCS: ప్రముఖులను న్యూడ్ వీడియో కాల్స్ తో బెదిరిస్తున్న చీటర్ ఒకరు అరెస్ట్ అయ్యాడు. రిధి బేడి అనే ఒక కేడీగాడు మహిళలా న్యూడ్ వీడియో కాల్స్ చేసి మాజీ ఐపీఎస్ అధికారిని బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఆరేళ్లపాటు మెకానికల్ ఇంజనీర్ గా పనిచేసే వచ్చిన రిధి బేడి డబ్బులు సులువుగా సంపాదించాలని న్యూడ్ వీడియో కాల్స్ ఫ్రాడ్స్ చేయడం మొదలు పెట్టాడు. మొదట ప్రముఖులను టార్గెట్ చేసి న్యూడ్ కాల్ చేస్తుంది అలా చేసి మాట్లాడుతున్న సమయంలో రికార్డు చేసి బెదిరించడం మొదలు పెట్టి, దుబాయ్ లో సెటిల్ అయినా ఇండియన్స్ ని టార్గెట్గా చేసుకుని ఈ దందా మొదలు పెట్టినట్టు సమాచారం

Jyothi Raj: అటువంటి అమ్మాయిలకూ శిక్ష పడాల్సిందే… జానీ మాస్టర్ కేసుపై డ్యాన్సర్ షాకింగ్ కామెంట్స్

అమ్మాయి గొంతుతో ముందుగా వీఐపీలని ట్రాప్ చేస్తున్న రిధి బెడి, తీయటి మాటలతో విఐపిలను బుట్టలో వేసుకుని న్యూడ్ కాల్స్ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. న్యూడ్ వీడియో కాల్స్ ని స్క్రీన్ రికార్డ్ చేసి రిధి బేడి బెదిరించడం మొదలు పెట్టేవాడని, న్యూడ్ వీడియో కాల్స్ ని సోషల్ మీడియాలో పెడతాను అంటూ రిధి బేడి బెదిరిస్తూ సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండేందుకు లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేస్తున్నట్టు తేలింది. దుబాయ్ తో పాటు ఇండియాలో ప్రముఖులు దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన రిధి బేడి వ్యవహారం ఇప్పుడు బట్టబయలు అయింది. మాజీ ఐపీఎస్ అధికారిని బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి ట్రాక్ చేయగా అసలు విషయం తెలిసింది. వెంటనే రిధి బేడిని అరెస్టు చేసి సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు రిమాండ్ కు పంపించారు.

Exit mobile version