మందు, సిగరేట్ కు అలవాటు పడిన వ్యక్తులు దాని నుంచి బయటపడాలి అంటే చాలా కష్టం. ఒకసారి అలవాటు పడ్డారంటే క్రమంగా అది వ్యసనంగా మారుతుంది. ఈ వ్యసనం నుంచి బయటపడటం చాలా కష్టం. ఈ వ్యసనాలు తప్పుడు మార్గంలో నడిపించేలా చేస్తుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. చివరకు మావల్ల కాదులే అని చెప్పి మళ్లీ ఆ వ్యసనాలకు బానిసలవుతుంటారు. అలాంటి వారు ఓ సింపుల్ ట్రిక్‌ను ఫాలో అయితే తప్పకుండా ఈ వ్యసనాల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత ఎక్కువ సేపు పచ్చని ప్రకృతితో గడిపితే ఆయా వ్యసనాల నుంచి బయటపడొచ్చని, ఆలోచనలు మారిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు పరిశోధనల వివరాలను నేచురల్ ఎన్విరాన్‌మెంట్స్ అండ్ కార్వింగ్: ది మెడియేటింగ్ రోల్ ఆఫ్ నెగెటివ్ అఫెక్ట్ అనే అద్యాయంలో పేర్కొన్నారు. ప్రకృతి మన ఆలోచనలను మార్చడమే కాకుండా జీవితాన్ని కూడా మార్చేస్తుంది.
Read: ఈ పువ్వు గురించి తెలిస్తే దగ్గరకి వెళ్లరు… చరిత్ర గురించి తెలిస్తే సెల్ఫీ దిగక మానరు…
