Site icon NTV Telugu

25 సంవ‌త్స‌రాల శ్ర‌మ‌… 75 వేల కోట్లు ఖ‌ర్చు… స‌వ్యంగా చేరితే…

అమెరికా మ‌రో రికార్డు సృష్టించేందుకు సిద్ద‌మ‌యింది.  విశ్వం పుట్టుక ర‌హ‌స్యాన్ని క‌నుగొనేందుకు కీల‌క ప్ర‌యోగం చేయ‌బోతున్న‌ది.  డిసెంబ‌ర్ 22 వ తేదీన ఫ్రెంచ్ గ‌యానాలోని ఏరియ‌ల్ స్పైస్ 5 రాకెట్ ద్వారా జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ను నింగిలోకి ప్ర‌యోగించ‌నున్నారు.  యూరోపియ‌న్ స్పేస్ ఏజెన్సీ, కెన‌డా స్పేస్ ఏజెన్సీ స‌హ‌కారంతో సాసా ఈ టెలిస్కోప్‌ను త‌యారు చేసింది.  సుమారు 25 ఏళ్ల‌పాటు 10 వేల మంది శాస్త్ర‌వేత్త‌లు నాలుగు కోట్ల ప‌నిదినాలు ప‌నిచేసి, ఈ టెలిస్కోప్‌ను త‌యారు చేశారు.  హెబుల్ టెలిస్కోప్‌కు ప్ర‌త్యామ్నాయంగా, దానికంటే శ‌క్తివంత‌మైన టెలిస్కోప్‌ను త‌యారు చేశారు.  

Read: ఆ న‌ది మొత్తం బూడిద‌గా మారిపోయింది… ఎందుకో తెలుసా…!!

20కి పైగా దేశాలు, సుమారు 75 వేల కోట్లు ఖ‌ర్చుచేసి ఈ టెలిస్కోప్‌ను త‌యారు చేశారు.  1996లో ఈ ప్రాజెక్టును ప్రారంభించి 2002లో జేమ్స్ వెబ్ అనే పేరును పెట్టారు.  అయితే, ఈ ప్రాజెక్టును ర‌ద్దు చేయాల‌ని అమెరికా చ‌ట్ట‌స‌భ‌లు ప్ర‌తిపాదించింది.  అయితే, అమెరిక‌న్ కాంగ్రెస్ ఈ ప్రాజెక్టు ర‌ద్దుకు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను తిర‌స్క‌రించి నిధులను విడుద‌ల చేసింది.  ఎట్ట‌కేల‌కు ఈ ప్రాజెక్టు పూర్తికావ‌డంతో డిసెంబ‌ర్ 22 న ఫ్రెంచ్ గ‌యానా నుంచి ప్ర‌యోగించ‌బోతున్నారు. 11 రోజుల‌పాటు రోద‌సిలో ప్ర‌యాణం చేసిన త‌రువాత ఈ జేమ్స్ వెబ్ సూర్యునిలోని ఎల్‌2 వాతార‌వ‌ణంలోకి ప్ర‌వేశిస్తుంది.  సూర్యుని వాతావ‌ర‌ణంలోకి చేరిన త‌రువాత ఈ జేమ్స్ వెబ్ అక్క‌డ సేక‌రించిన స‌మాచారాన్ని రోజుకు 480 జీబీ డేటా రూపంలో భూమిమీద‌కు పంపిస్తుంది.  

Exit mobile version