NTV Telugu Site icon

నారా లోకేష్ సంచ‌ల‌న ట్వీట్‌: ఏపీలో ఆ డ్ర‌గ్స్‌ డాన్ ఎవ‌రు?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ డ్ర‌గ్స్ వ్యవ‌హారంపై ఓ ట్వీట్ చేశారు.  గుజ‌రాత్‌లో తీగ‌లాగితే ఏపీలో డొంక క‌దిలింద‌ని, రూ.72 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను తాలిబన్లతో మాట్లాడి ఏపీకి తెచ్చిన డ్రగ్స్ డాన్ ఎవరు అంటూ అంటూ నారాలోకేష్ ట్వీట్ చేశారు.  తాలిబన్ల డ్రగ్స్ కి తాడేపల్లి ప్యాలస్ కి ఉన్న లింకేంటి? లిక్కర్ మాఫియాతో మొదలెట్టి ఇప్పుడు ఏపీని ఏకంగా డ్రగ్స్ డెన్ గా మార్చేశార‌ని నారా లోకేష్ ట్వీట్ చేశారు.  దేశంలో ఉన్న అత్యున్నత వ్యవస్థలన్ని ఏపీ వైపు వేలు చూపిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఇతర రాష్ట్రాలను హెచ్చరిస్తుంటే డీజీపీ గారు మాత్రం జగన్ భక్తిలో మునిగితేలుతున్నారు. డ్రగ్స్ డాన్ ని కాపాడేందుకు ప్రయత్నాలు ఆపి ఏపీ పరువు కాపాడేందుకు శ్రద్ధ చూపాలి అని లోకేష్ ట్వీట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు.  ఇటీవ‌లే గుజ‌రాత్ లోని ముద్రా పోర్టులో వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.  ఈ హెరాయిన్ ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి వ‌చ్చిన‌ట్టుగా డీఆర్ఐ అధికారులు గుర్తించారు. కంటెయిన‌ర్ల‌పై విజ‌య‌వాడ చిరునామా ఉండ‌టంతో దుమారం రేగింది.  

Read: కోపంగా ఉన్న కోతి ప‌క్క‌న నిల‌బ‌డి ఫొటో దిగేందుకు ప్ర‌య‌త్నిస్తే… ఇలానే జ‌రుగుతుంది…!!