Site icon NTV Telugu

స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు షాకిచ్చిన ఆఫ్రికా… ఆ వ్యాక్సిన్ వాడితే…

క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు ప్ర‌స్తుతం అనేక వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మొద‌ట ఈ మ‌హమ్మారికి వ్యాక్సిన్‌ను త‌యారు చేసింది మాత్రం ర‌ష్యానే. ర‌ష్యా వ్యాక్సిన్ ఇప్పటికే ప్ర‌పంచంలోని అనేక దేశాలు అత్య‌వ‌స‌ర వినియోగం కింద వినియోగిస్తున్నాయి. స్పుత్నిక్ వీ బూస్ట‌ర్ డోస్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, మొద‌టి వ్యాక్సిన్ త‌యారు చేసిన ర‌ష్యాలోనే ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. మ‌ర‌ణాలు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య త‌గ్గిపోవ‌డంతో కేసులు మ‌ర‌ణాలు పెరుగుతున్నాయి. ఇక ఈ వ్యాక్సిన్‌ను ఆఫ్రికా దేశాల‌కు ర‌ష్యా ఎగుమ‌తి చేస్తున్న‌ది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌పై ప‌రిశోధ‌న‌లు చేసిన ద‌క్షిణాఫ్రికా ర‌ష్యాకు షాకిచ్చింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌తో హెచ్ఐవీ వ‌చ్చే ముప్పు ఉంద‌ని ప్ర‌క‌టించింది. ఆఫ్రికా దేశాల్లో హెచ్ఐవీ కేసులు అధిక‌సంఖ్య‌లో ఉన్నాయి. ఇప్ప‌టికే హెచ్ఐవీ తో స‌త‌మ‌త‌వ‌ముతున్న ఆయా దేశాలు ద‌క్షిణాఫ్రికా చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఉలిక్కిప‌డ్డాయి. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ వాడ‌కాన్ని నిలిపివేసే అంశంపై సుమాలోచ‌న‌లు చేస్తున్నాయి. ఇప్ప‌టికే న‌మీబియా ర‌ష్యా వ్యాక్సిన్ వినియోగాన్ని నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

Read: ఇండియా పాక్ మ్యాచ్‌లో దీన్ని జ‌యించిన జ‌ట్టుకే విజ‌యం…

Exit mobile version