బిగ్‌బాస్ హౌస్‌లో శనివారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. గత వారం రోజులుగా హౌస్‌లో జరిగిన ఘటనలపై హోస్ట్ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్‌లో తరచుగా గొడవ పడుతున్న షణ్ముఖ్, సిరి జంటపై నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. దీంతో వీళ్లిద్దరినీ నాగార్జున కన్సెషన్ రూంకు పిలిపించుకుని మట్లాడారు. వాష్‌రూంకి వెళ్లి తనను తాను గాయపరుచుకున్న సిరిపై మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితి హౌస్‌లో అవసరమా అని ప్రశ్నించారు. నాగ్ ప్రశ్నకు స్పందించిన సిరి … ‘ఏమో సర్… నాకు క్లారిటీ లేదు… నా స్టోరీ నాకు తెలుసు… బయట నేనేంటో తెలుసు… అయినా బంధం ఏర్పడుతోంది.. ఎందుకో తెలియడం లేదు’ అని కన్నీటిపర్యంతమైంది.
మరోవైపు షణ్ముఖ్‌ను కూడా నాగ్ ప్రశ్నించారు. తాను మెంటల్‌గా వీక్ అయిపోయానని.. దీప్తిని బాగా మిస్ అవుతున్నానని షణ్ముఖ్ చెప్పాడు. దీంతో బిగ్‌బాస్‌ను గేట్లు తెరవమని నాగ్ చెప్పాడు. దీప్తిని మిస్ అయితే హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవాలని నాగ్ ఆదేశించాడు. అయితే నాగ్ చెప్పడం వల్ల షణ్ముఖ్ నిజంగానే హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడో లేదో తెలుసుకోవాలంటే ఈరోజు రాత్రికి ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే. ప్రస్తుతానికి స్టార్ మా విడుదల చేసిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.