నగరి ఎమ్మెల్యే రోజా స్వపక్షం వారితోనే పోరాడుతుంటారు. తనను ఓడించడానికి అసమ్మతి నేతలు కుట్రపన్నారని గతంలో కన్నీరుపెట్టుకున్నారు. జగన్ కి కంప్లైంట్ చేశారు. తాజాగా రెబల్స్ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. తన ఎదుగుదలను ఆపడానికి ఐదుగు మండల వైసీపీ రెబెల్స్ నాయకులను వెనక నుండి రెచ్చగొట్టి నా పై ఆరోపణలు ఎవరు చేయిస్తున్నారో ఆధారాలతో సహా తన వద్ద ఉందన్నారు రోజా. వారి చిట్టాను జగన్ సమక్షంలో ఆధారాలతో సహా బట్టబయలు చేస్తానని రోజా అన్నారు.
రాష్ట్రమంతటా వైసీపీ పాలన.. నగరిలో టీడీపీ పాలన అని ఎద్దేవా చేసిన వారి ఆరోపణలు చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు నవ్వుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో తనకు పార్టీకి అండగా ఉంటూ జగనన్న వెనువెంట నిలిచిన వారందరినీ గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి ఒక్కరినీ గుర్తించి పదవులు ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో టీడీపీ వాళ్ళకు పదవులు ఇచ్చినట్లు పదేళ్ల పాటు పార్టీకి కష్టపడి వారిని పక్కన పెట్టినట్లు ఆత్మ సాక్షిగా చెప్పాలని అసమ్మతి నాయకులను కోరారు రోజా.
గ్రామస్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయి ఎలక్షన్స్ వరకు కష్టపడి పనిచేసిన టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అభ్యర్థిని పుత్తూరు మున్సిపాలిటీలో రిజర్వేషన్ పరంగా బలమైన వ్యక్తి లేనందువలన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగిందన్నారు. జగనన్నకు తను పెద్ద ఫాలోవర్ని, నేను పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకురాలిని అన్నారు. అవసరమయితే పార్టీ కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడబోనని ఆమె తెలిపారు. తన గురించి అటు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ వారికి కూడా తెలుసని రోజా గుర్తు చేశారు. చిత్రహింసలకు గురి చేసి,తనను ఆర్థికంగా అన్ని విధాలా దెబ్బతీసి నగరి నియోజకవర్గంలో నానా ఇబ్బందులకు గురి చేసిన వారు టీడీపీ ప్రభుత్వం నడుస్తున్నట్టుగా ఉందని ఆరోపణలు చేసిన ఆ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
అసమ్మతి నాయకులు వారి అనుచరులపై కేసులు పెడుతున్నానని ఆరోపణలు చేయడం దురదృష్టకరం అన్నారు. అసలు తాను ఎవరి పైన కేసులు పెట్టడం లేదని అలాంటప్పుడు తన పార్టీలోనే ఉంటూ కేసులు పెట్టాలని చెప్పడం ఎంతవరకు సబబు అని ఆమె అన్నారు. వ్యక్తిగతంగా తాను ఎవరిపై కూడా కక్ష సాధింపు చూపలేదని తన కుటుంబం ఎంత క్షేమంగా ఉండాలని కోరుకుంటాను అలాగే ఎదుటి వారు కూడా ఉండాలని కోరుకునే వ్యక్తిని తాను అన్నారు రోజా.
తన నియోజకవర్గంలో ఎవరైనా సరే అక్రమ వ్యాపారాలకు పాల్పడినట్లు అయితే కఠినంగా శిక్షపడేలా అధికారులకు ఆదేశాలిచ్చినా…ఎవరి ప్రాబల్యంతో తప్పుచేసి బయట పడుతున్నారో తనకు తెలుసన్నారు రోజా. బియ్యపు మధుసూదన్ రెడ్డి తన నియోజకవర్గంలో శ్రీకాళహస్తి దేవస్థానానికి బయట వ్యక్తులు చైర్మన్ నియామక ఆదేశాలను రద్దుపరచినట్టు తాను కూడా తనపై ఆరోపణలు చేసిన వ్యక్తుల నియామకాన్ని రద్దుపరచగలనన్నారు. కానీ అలాంటి సంస్కారం తనకు లేదన్నారు రోజా. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఉంటాయని తాను ఎవరిపై కంప్లైంట్ చేయకపోవడం తన చేతగానితనంగా అసమ్మతి నాయకులు భావిస్తున్నారన్నారు. కంప్లైంట్ చేయాలా వద్దా అనేది వారు చెప్పాలని కోరారు రోజా. తన నియోజకవర్గంలో తనపై బురదజల్లే కార్యక్రమం మానుకోవాలని అసమ్మతి నాయకులను హెచ్చరించారు రోజా.