NTV Telugu Site icon

మిస్ట‌రీ: ఆ బ్రిడ్జి మీద‌నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్న కుక్కలు… కార‌ణం…

ప్ర‌పంచంలో నిత్యం ఎన్నో సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి.  వాటిల్లో కొన్ని ఘ‌ట‌న‌లు ఎందుకు జ‌రుగుతున్నాయి అని తెలుసుకోవ‌డం చాలా క‌ష్టం.  చాలా ఘ‌ట‌న‌లు మిస్ట‌రిగా మిగిలిపోతున్నాయి. టెక్నిక‌ల్‌గా ఎంత అభివృద్ధి చెందిన‌ప్ప‌టికీ, సాల్వ్ కాకుండా మిగిలిపోయిన ఘ‌ట‌న‌లు కోకొల్లలు.  అందులో ఒక‌టి డాగ్ సూసైడ్ బ్రిడ్జి.  స్కాట్‌లాండ్‌లోని ఓవ‌ర్‌టైన్‌లో ఓ బ్రిడ్జి ఉన్న‌ది.

Read: క్యాట‌రింగ్‌కు వ‌చ్చి అవి కాజేయ్యాల‌ని అనుకున్నాడు… య‌జ‌మాని గ‌మ‌నించ‌డంతో…

పురాత‌న‌మైన ఈ బ్రిడ్జి వైపు కుక్క‌ల‌ను తీసుకురావాలంటే వాటి య‌జ‌మానులు భ‌య‌ప‌డిపోతుంటారు.  ఆ బ్రిడ్జిమీద‌కు కుక్క‌లు వ‌స్తే వెంట‌నే అవి అక్క‌డి నుంచి కింద‌కు దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాయ‌ట‌.  ఎందుకు అలా చేస్తున్నాయి అన్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు మిస్ట‌రీగా మారిపోయింది.  ఈ మిస్ట‌రీ డాగ్ సూసైడ్ బ్రిడ్జి ఎత్తు 50 అడుగులు.  క్రింద నీళ్లు ఉండ‌వు.  దీంతో దూకిన కుక్క‌లు మ‌ర‌ణిస్తున్నాయి.  గ‌త 70 ఏళ్ల కాలంలో 600 వ‌ర‌కు కుక్క‌లు ఇలా ఈ బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాయి.  ఈ వంతెన‌పై ఆత్మ‌లు తిరుగుతుంటాయ‌ని, అవే కుక్క‌లు ఆత్మ‌హ‌త్య చేసుకునేలా చేస్తున్నాయ‌ని క‌థలుగా చెప్పుకుంటారు.  కానీ, దానిని సాంకేతికంగా నిరూపించ‌లేక‌పోయారు.