Site icon NTV Telugu

మ‌య‌న్మార్‌లో దారుణం… విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు… 70 మంది గ‌ల్లంతు…

మ‌య‌న్మార్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది.  ఉత్త‌ర మ‌య‌న్మార్‌లోని క‌చిన్ రాష్ట్రంలోని జాడే గ‌నుల్లో కార్మికులు ప‌నిచేస్తుండా హ‌టాత్తుగా కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి.  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో 70 మంది కార్మికులు గ‌ల్లంత‌య్యారు.  ఒక‌రు మృతి చెందిన‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు.  ప్ర‌స్తుతం రెస్క్యూ కార్య‌క్ర‌మాలు చురుగ్గా సాగుతున్నాయి.  ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఖ‌నిజాల గ‌నుల్లో జాడే గ‌నులు ఒక‌టి.  పెద్ద గ‌నులు మాత్ర‌మే కాదు, అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన గ‌నులు కూడా.  

Read: ఒమిక్రాన్‌పై బిల్‌గేట్స్ కీల‌క వ్యాఖ్య‌లు…

ఈ గ‌నుల్లో ప్ర‌మాదాలు జ‌రుగుతూనే ఉన్నాయి.  ఇప్ప‌టికే ఈ హ్పాకాంత్ లోని జాడే గ‌నుల్లో అనేక‌మార్లు ప్ర‌మాదాలు జ‌రిగాయి.  దీంతో ఈ గనుల్లో ప్రభుత్వం మైనింగ్‌ను నిషేధించింది.  అయిన‌ప్ప‌టికీ స్థానికులు ఉపాదికోసం నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఈ గ‌నుల్లో ప‌నిచేస్తున్నారు.  క‌రోనాతో ఆర్థిక ప‌రిస్థితి కుదేల‌వ్వ‌డం, మ‌యన్మార్‌లో రాజ‌కీయ అనిశ్చితి నెల‌కొన‌డంతో చేసేది లేక ఉపాధికోసం ప్రాణాల‌కు తెగించి కార్మికులు ఈ గ‌నుల్లో పనిచేస్తుంటారు. 

Exit mobile version