NTV Telugu Site icon

Different Amit Shah: భిన్నమైన అమిత్ షాని చూశాం.. ముస్లిం నేతల ప్రశంసలు

Amit Shah

Amit Shah

కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కొత్త చూస్తున్నామని కొందరు ముస్లిం నేతలు ప్రసంశలు కురిపించారు. ముస్లిం మత పెద్దల ప్రతినిధి బృందం నిన్న అర్థరాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకుంది. శ్రీరామనవమి తర్వాత మతపరమైన హింస, ద్వేషపూరిత ప్రసంగాలపై చర్చించారు. ప్రతినిధి బృందానికి జమియత్ ఉలమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ, కార్యదర్శి నియాజ్ ఫరూఖీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు కమల్ ఫరూఖీ, ప్రొఫెసర్ అక్తరుల్ వాసే నాయకత్వం వహించారు.
Also Read:Kolagatla Veerabhadra Swamy: పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.. అప్పులు సహజం..!

దేశం ఎదుర్కొంటున్న 14 సవాళ్లను ప్రతినిధి బృందం లేవనెత్తిందని నియాజ్ ఫరూఖీ తెలిపారు. బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో ఇటీవల జరిగిన మత హింసాత్మక ఘటనలపై సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఇది అమిత్ షా రాజకీయ ప్రసంగాల కంటే భిన్నంగా కనిపించారని చెప్పారు. కేంద్ర హోం మంత్రి సానుకూలంగా స్పందించారని, ఆయన తాము చెప్పింది పూర్తిగా విన్నారని పేర్కొన్నారు. బీహార్‌లోని నలందలో మదర్సాకు నిప్పంటించిన ఘటనను కూడా ముస్లిం నేతలు లేవనెత్తారని ఫరూఖీ తెలిపారు. బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను కూడా తాము లేవనెత్తామని ముస్లిం నేత చెప్పారు. మీ పక్షాన మౌనం ముస్లింలలో నిరాశకు దారితీస్తుందని తాము అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆయన దానిని పరిశీలిస్తానని చెప్పారని ఫరూకి వెల్లడించారు. మేము ఏ నాయకుడిని లక్ష్యంగా చేసుకోలేదన్నారు. దేశంలో వాతావరణాన్ని మార్చడం తమ లక్ష్యం అని చెప్పారు.

Also Read:Minister KTR: పేపర్‌ లీకేజీ, ధరల పెరుగుదలపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

రామనవమి ఊరేగింపుల సందర్భంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. తమ ర్యాలీలపై దాడి జరిగిందని బీజేపీ ఆరోపిస్తుండగా, రాజకీయ ప్రయోజనాల కోసం హింసకు పాల్పడింది బీజేపీయేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ నివాసితులు జునైద్, నసీర్‌ల హత్యపై కూడా చర్చలు జరిగాయి. ఫిబ్రవరి 15న నసీర్ (25), జునైద్ (35)లను గోసంరక్షకులు అపహరించారు. మరుసటి రోజు ఉదయం హర్యానాలోని భివానీలో వారి మృతదేహాలు కాలిపోయిన కారులో కనిపించాయి. హోం మంత్రితో సమావేశం తర్వాత ముస్లిం ప్రతినిధి బృందం ఎంత సంతృప్తి చెందింది.