ప్రస్తుతం టాలీవుడ్ లో మ్యూజికల్ వార్ ఎవరి మధ్య అని అడిగితే ఎవరైనా టక్కున చెప్పేది దేవిశ్రీప్రసాద్, థమన్ పేర్లే. ఇద్దరూ గత కొంతకాలంగా బ్లాక్ బస్టర్స్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఏ స్టార్ సినిమా ఆరంభిస్తున్నా… మ్యూజిక్ గురించి ముందుగా సంప్రదించేది వీరిద్దరినే. మరి వీరిద్దరూ సినిమాకు ఎంత వసూలు చేస్తారనే విషయం చాలామందికి ఆసక్తి కలిగించే అంశం. సన్నిహిత వర్గాల సమాచారం మేరకు దేవిశ్రీప్రసాద్ నాలుగు కోట్ల వరకూ ఛార్జ్ చేస్తారని, థమన్ 3 కోట్లు వసూడు చేస్తాడని వినిపిస్తోంది. ఇద్దరి చేతుల్లోనూ నిండుగా సినిమాలు ఉన్నాయి. వాటిలో ఎవరు ఎక్కువ హిట్స్ ఇస్తే వారికి కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం అల్లుఅర్జున్ తో ‘పుష్ప’, రవితేజ హీరోగా ‘ఖిలాడీ’, వెంకటేశ్, వరుణ్ తేజ్ ‘ఎఫ్3’, పవన్ కళ్యాణ్ 28, రామ్ 19, దిల్ రాజు రౌడీ బాయ్స్ సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఉప్పెన, రంగ్ దే, అల్లుడు అదుర్స్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. థమన్ విషయానికి వస్తే మహేశ్ తో ‘సర్కారువారి పాట’, నాని ‘టక్ జగదీష్’, బాలకృష్ణ ‘అఖండ’, అఖిల్ ‘ఏజెంట్’ సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ‘క్రాక్, వైల్డ్ డాగ్, యువరత్న, వకీల్ సాబ్’ విడుదల అయ్యాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరు తమ మ్యూజిక్ తో పై చేయి అనిపించుకుంటారో చూడాలి!
దేవిశ్రీప్రసాద్ వర్సెస్ థమన్
