Site icon NTV Telugu

Preschool Teacher: పిల్లలతో టీచర్లు ఇలా వ్యవహరిస్తారా?

Preschool Teacher

Preschool Teacher

చిన్నపిల్లలపై దెబ్బ పడితే చాలు టీచర్లపైనే ఎదురుదాడులు చేస్తున్న రోజు ఇవి. దీంతో పిల్లలకు చదువు వచ్చినా రాకపోయినా మనకేంటి అని టీచర్లు పట్టించుకోవడం లేదు. అయితే, కొందరు టీచర్లు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. తాజాగా పనిపిల్లల్లతో ఓ టీచర్ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోపంగా ఉన్న ఉపాధ్యాయురాలు ప్రీస్కూల్ పిల్లవాడిని బలవంతంగా లాగుతున్నట్లు ఉన్న ఓ వీడియో సిసిటివి కెమెరాలో రికార్డు అయింది. మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను నేలపైకి లాగడం, విసిరివేయడం, చెంపదెబ్బ కొట్టడం వంటివి చేసింది. ఈ ఘటన ముంబైలోని కందవల్లిలో జరిగినట్లు సమాచారం. రెండేళ్ల చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు ఇద్దరు ఉపాధ్యాయులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Shikhar Dhawan: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ధవన్.. తొలి భారత క్రికెటర్‌గా రికార్డ్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 1 నుంచి మార్చి 27 మధ్య టీచర్లు పిల్లలపై దాడికి పాల్పడ్డారు. ఓ బాలుడి ప్రవర్తలో మార్పు గమనించిన విద్యార్థి తండ్రి వివరాలు ఆరా తీశాడు. పిల్లలు ప్రతిరోజూ పడుతున్న భయాందోళనలను సీసీటీవీలో చూశారు. ప్లేస్కూల్‌లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూల్క్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కండివాలి వెస్ట్‌లోని ప్రీస్కూల్ నుండి భయంకరమైన వీడియోలు. వాట్సాప్ ద్వారా అందింది. మరిన్ని వీడియోలు ఉన్నాయి. ఈ ఉపాధ్యాయులు పిల్లలతో ఎలా వ్యవహరిస్తున్నారో ఒక్కసారి చూడండి అంటూ ఓ నెటిజన్ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

Exit mobile version