Site icon NTV Telugu

ముంబై- క‌ర్ణాట‌క పేరు మార్పు…

క‌ర్ణాట‌క రాష్ట్రం ఏర్ప‌డి 65 ఏళ్లు పూర్తయింది.  ఈ సంద‌ర్భంగా క‌ర్ణాట‌క రాజ్యోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించారు.  ఈ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజు బొమ్మై పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  క‌ర్ణాట‌క రాష్ట్రం ఏర్పాటైన త‌రువాత స‌రిహ‌ద్దు వివాదాలు నెల‌కొన్నాయ‌ని, అవి ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నాయని, స‌రిహ‌ద్దుల్లోని ప్రాంతాల‌కు పాత పేర్లు ఉండ‌టం వ‌ల‌నే ఇలాంటి వివాదాలు వ‌స్తున్నాయ‌ని తెలిపారు.

Read: ఆ కేసులో మాజీ మంత్రి అరెస్ట్‌…

 
ఇప్ప‌టికే హైద‌రాబాద్‌-క‌ర్ణాట‌క ప్రాంతాన్ని క‌ల్యాణ క‌ర్ణాట‌కగా మార్చిన‌ట్టు తెలిపారు.  కాగా ముంబై-క‌ర్ణాట‌క ప్రాంతాన్ని కిట్టూర్‌-క‌ర్ణాట‌క‌గా మార్చ‌బోతున్న‌ట్టు సీఎం బ‌స‌వ‌రాజు బొమ్మై తెలిపారు.  త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే కేబినెట్ స‌మావేశంలో పేరు మార్పుపై ఆమోద‌ముద్ర వేయ‌నున్న‌ట్టు సీఎం బ‌స‌వ‌రాజు బొమ్మై తెలిపారు.

Exit mobile version