Site icon NTV Telugu

ఇది ప్రజా విజయం.. జగన్ నిర్ణయంపై రఘురామ స్పందన

మూడురాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవడంపై అమరావతి వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముందునుంచీ అమరావతికి తన మద్దతు ప్రకటించి, రాజధాని రైతులకు బాసటగా నిలిచారు నరసాపురం ఎంపీ రఘురామ. తాజా నిర్ణయంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరంకుశంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు సాధించిన విజయం.

అవిశ్రాంతంగా పోరాటం చేసిన అమరావతి రైతులు, రైతు సోదరులకు, పర్యవేక్షణ కమిటీ నిర్వాహకులకు మహిళా సంఘాలు, సమర్ధించిన అందరికీ చెందుతుంది. అమిత్ షా తిరుపతి పర్యటన అనంతరం జరిగిన నిర్ణయం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అన్నారు రఘురామ. మళ్ళీ మూడు కాదు రెండు అని అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా గత ప్రభుత్వం ఏదైతే ఎలా చేయాలనుకున్నారో అలా చేయాలని.. లేదంటే దానికంటే మెరుగ్గా రాజధాని నిర్ణయం ప్రకటించాలన్నారు. జై అమరావతి.. జై జై అమరావతి అని సంతోషం వ్యక్తం చేశారు రఘురామ.

Exit mobile version