Site icon NTV Telugu

సినిమా టికెట్ల ధరల విచారణ రేపటికి వాయిదా

ప్రజల ప్రయోనాల కోసం సినిమా టికెట్ల ధరలు అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం జీవో 35ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోతో సినిమా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు ఏపీ హైకోర్టు ఆశ్రయించారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ల పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు ఉందని తెలుపుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 35ను రద్దు చేస్తూ తీర్పనిచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. సింగిల్‌ జడ్జి తీర్పుపై డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసింది.

అయితే సింగిల్‌ జడ్జి తీర్పు కాపీ అందకపోవడంతో హైకోర్టు ఈ విచారణను రేపటి వాయిదా వేసింది. ఈ క్రమంలో టికెట్ల ధరలపై వెంటనే విచారణ చేపట్టకపోతే టికెట్‌ ధరలు పెంచి అమ్మకునే అవకాశం ఉందని ప్రభుత్వం తరుపున న్యాయవాది వెల్లడించారు. ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు రేపు ఉదయం మొదటి కేసుగా విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది.

Exit mobile version