NTV Telugu Site icon

2021లో నెటిజ‌న్లు వీటిని తెగ వాడేశారు…

స్మార్ట్ ప్ర‌పంచంలో అన్ని స్మార్ట్‌గా యూజ్ చేస్తున్నారు.  ఒక‌ప్పుడు ఏదైనా స‌రే మెసేజ్ చేయాలంటే త‌ప్ప‌ని స‌రిగా మొత్తం టైప్ చేయాల్సి వ‌చ్చేది.  కానీ, ఇప్పుడు ఆ శ్ర‌మ అక్క‌ర్లేకుండా మ‌న ఫీలింగ్స్‌ని ఎమోజీల రూపంలో పెట్టేస్తున్నారు.  2021లో నెటిజ‌న్లు ఎలాంటి ఎమోజీల‌ను ఎక్కువ‌డా యూజ్ చేశారు అనే దానిపై యూనికోడ్ క‌న్సార్టియం అనే నాన్ ప్రాఫిట‌బుల్ సంస్థ స‌ర్వేను నిర్వ‌హించి డేటాను విడుద‌ల చేసింది.  

Read: ఆనంద్ మ‌హీంద్రా ఆటోపై జోహో సీఈవో ట్వీట్‌… బాగుంది కానీ…

ఈ డేటా ప్ర‌కారం 2021లో ఫేస్ విత్ టియ‌ర్స్ ఆఫ్ జాయ్ ఎమోజీని అత్య‌ధికంగా నెటిజ‌న్లు వినియోగించారు.  ఆ త‌రువాత స్థానంలో రెడ్ ల‌వ్ సింబ‌ల్‌, థ‌ర్డ్ ప్లేస్‌లో న‌వ్వుతూ నేల‌పై దొర్ల‌డం, థ‌మ్స్ అప్ నాలుగో స్థానంలో ఉండ‌గా, లౌడ్ క్రైయింగ్ ఫేస్ సింబ‌ల్ ఐదో స్థానంలో నిలిచింది.  సింబ‌ల్స్ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత చాట్ ఎమోజీ చాట్ మెసేజ్‌లు అధికంగా వినియోగిస్తున్నారు.