Site icon NTV Telugu

మ‌నుషులే కాదు… కోతులు కూడా కిడ్నాప్ చేస్తాయ‌ట‌…

డ‌బ్బుకోస‌మో, కోప‌తాపాల‌తోనో మ‌నుషులు కిడ్నాప్ వ్య‌వ‌హారాల‌కు పాల్ప‌డుతుంటారు.  మ‌నుషుల‌ను కిడ్నాప్ చేయ‌డం లేదా, పెంపుడు జంతువుల‌ను కిడ్నాప్ చేయ‌డం చేస్తుంటారు.  మ‌నుషులు మాత్ర‌మే కాదు మేము కూడా కిడ్నాప్ చేయ‌గ‌లమ‌ని నిరూపించింది ఓ కోతి.  ఓ చిన్న కుక్క‌పిల్ల‌ని కిడ్నాప్ చేసి మూడు రోజుల‌పాటు త‌న‌వ‌ద్ద‌నే బందీగా ఉంచుకొని స్థానికుల‌కు చుక్క‌లు చూపించింది.  ఈ సంఘ‌ట‌న మ‌లేషియాలోని త‌మ‌న్ లెస్టారిపుత్ర‌లో జ‌రిగింది.  ఓ కోతి రెండు వారాల వ‌య‌సున్న చిన్న కుక్క‌పిల్ల‌ను కిడ్నాప్ చేసి అడ‌విలోని చెట్ల‌ను ఎక్కేసింది.  చెట్టుమీద నుంచి మ‌రో చెట్టు మీద‌కు వెళ్తున్నా, కుక్క‌పిల్ల‌ను మాత్రం వ‌ద‌ల‌లేదు.  ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన ప్ర‌జలు కుక్క‌పిల్ల‌ను విడిపించేందుకు నానా తంటాలు ప‌డ్డారు.  మూడు రోజుల‌పాటు తీవ్రంగా ప్ర‌య‌త్నం చేయ‌గా ఎట్ట‌కేల‌కు కుక్క‌పిల్ల‌ను వ‌దిలివేసింది ఆ కోతి.  

Read: విచిత్రం: డ్రోన్‌పై కాకి దాడి… ఎందుకో తెలుసా?

Exit mobile version