మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మా విజయం తరువాత విష్ణు తనకు మద్ధతు తెలిపిన వారిని కలుస్తున్నారు. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే మా అధ్యక్షుడు మంచు విష్ణు, మోహన్ బాబులు హీరో బాలకృష్ణ ఇంటికి వెళ్లి పలకరించారు. మద్ధతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో బాలయ్యబాబు అల్లుడిని ఓడించడానికి తాను మంగళగిరిలో ప్రచారం చేశానని, మంగళగిరిలో టీడీపీ ఓటమిపాలైందని అన్నారు. అయితే, మా ఎన్నికల్లో మద్ధతు ఇవ్వాలని కోరిన వెంటనే మంచు విష్ణుకు బాలయ్య మద్ధతు ఇచ్చారని, విష్ణుకు ఓటు వేశారని, అన్నీ మర్చిపోయి విష్ణుకు మద్ధతు ఇవ్వడం బాలయ్య మంచి మనసుకు ఓ నిదర్శనం అని మోహన్‌బాబు పేర్కొన్నారు.
మంగళగిరిలో బాలయ్య అల్లుడికి వ్యతిరేకంగా ప్రచారం చేశా- మోహన్ బాబు
